మంత్రి హరీష్ రావు
మెదక్: మెదక్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బెంగళూరు నగరంలో జరిగిన ఐటి దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఎన్నకల్లో డబ్బు పంచి గెలిచే ప్రయత్నం. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అంబికాపతి సతీమణి అశ్వత్తమ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. ఇద్దరు ఇంట్లో వుండగానే ఐటి దాడులు జరిగాయి. ఐటీ దాడుల్లో రూ. 42 కోట్ల నగదు దొరికాయి. కాంగ్రెస్ దీనిపై సమాధానం చెప్పాలని అన్నారు.

అంబికాపతి డీకే శివ కుమార్ కు అత్యంత సన్నిహితుడు అని, ఈశ్వరప్ప కి కూడా సన్నిహితుడు అని తెలుస్తున్నది. తెలంగాణ టాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి, పంపే కుట్ర చేస్తున్నారు. కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి, వ్యాపారుల నుండి, కాంట్రాక్టర్ దగ్గరి నుండి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయాలని, ఈ అక్రమ వసూళ్లకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. బెంగళూరు నుండి వయా చెన్నై ద్వారా హైద్రాబాద్ పంపాలని ప్లాన్. ఇందులో కొందరు బిల్డర్లు, కాంట్రాక్టర్లు పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. కర్ణాటక అక్రమ సొమ్మును తెలంగాణకు తరలించే ప్రయత్నం ఎవరైతే చేస్తారో భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు. పక్క పార్టీల దిక్కు చూస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. షెడ్యూల్ వచ్చినా టికెట్లు డిక్లేర్ చేసుకోలేని దుస్థితి. కర్ణాటకలో ప్రతి ఎస్ఎఫ్టీ కి 75 రూపాయల పన్నును కాంగ్రెస్ నాయకులు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, గెలిచేది బి ఆర్ ఎస్ పార్టీ. తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదు. మీకు తగిన గుణపాఠం తప్పదని అన్నారు.



