21.2 C
New York
Friday, May 31, 2024

నా మీద ఎంత మంది దాడి చేసినా బెదరను

- Advertisement -

గన్ మీద ఎంత మంది దాడి చేసినా బెదరడు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇవాళ గుడివాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు. అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు.

జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పెత్తందారుల ఓటమిని ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అంటే దాని అర్థం ఏమిటి..? విజయానికి మనం అంతా చేరువలో ఉన్నామని.. విజయానికి వారు దూరంగా ఉన్నారు.

మీకు సేవ చేయాలన్నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా.. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదిటి మీద వారు చేసిన గాయం.. దేవుడు మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్ట్ రాశాడని అర్థం. కూటమి నాయకుడు చంద్రబాబు 30 ఏళ్ల ఫిలాసపీని గమనించండి అని సూచించారు. పేద ప్రజలకు ఏ మంచి చేయవద్దన్నదే చంద్రబాబు ఫిలాసపీ అన్నారు సీఎం జగన్.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!