Tuesday, January 27, 2026

ఎంత రెచ్చగొట్టినా నోరు జారి మాట్లాడొద్దు

- Advertisement -

ఎంపీలతో ప్రధాని భేటీ

no-matter-how-much-it-provokes-dont-keep-your-mouth-shut
no-matter-how-much-it-provokes-dont-keep-your-mouth-shut

న్యూఢిల్లీ ఆగస్టు 3, (వాయిస్ టుడే):  లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది దేశ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. NDA వర్సెస్ INDIA ఫైట్‌ ఫిక్స్ అయిపోయింది. రెండు కూటములు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలకు సక్సెస్ మంత్రాలు ఉపదేశించారు. అందులో ప్రధానంగా ఓ అంశంపైనే చర్చించారు. ప్రతిపక్షాలు ఏ విషయంలో అయినా సరే ఎన్ని విమర్శలు చేసినా, ఎంత రెచ్చగొట్టినా పొరపాటున కూడా నోరు జారి మాట్లాడొద్దని సూచించారు మోదీ. NDAలోని ఎంపీలతో విడతల వారీగా సమావేశమవుతున్న ప్రధాని…పలు రాష్ట్రాలకు చెందిన 45 మంది ఎంపీలతో ఇటీవలే భేటీ అయ్యారు. పేదల కోసమే పని చేయాలని సూచించారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఇస్తున్న ఉచిత హామీలపైనా ప్రజలకు అవగాహన కల్పించాలని, వాటిని వ్యతిరేకించాలని తెలిపారు. ఎన్నికల్లో గెలవడానికి అన్ని విధాలుగా కష్టపడాలని, ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకోవాలని సుతిమెత్తగా హెచ్చరించారు. “ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. పరిధి దాటి మాట్లాడతాయి. కావాలనే రెచ్చగొడతాయి. అయినా సరే మీరు మాత్రం మీ మాటలు తూలనివ్వకండి. అనవసరపు వివాదాల్లో చిక్కుకోకండి. ఇండియా కూటమిని గట్టిగా ఎదుర్కోవాలి. నిజానిజాలేంటే ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టండిదక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎంపీలకు సూచించడం వెనక ఓ కారణముంది.

గతంలో ఎన్‌డీఏ ఈ రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. స్థానికంగా క్యాడర్ లేకపోవడం వల్ల ఓట్లు రాబట్టుకోలేకపోయింది. అందుకే ఈ సారి ఇక్కడి ఓటర్లకు దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మోదీ. ఈ 9 ఏళ్లలో తమ ప్రభుత్వం ఏం చేసిదో ప్రజలకు వివరించాలని మోదీ ఎంపీలకు సూచించారు. లోక్‌సభ నియోజకవర్గాల్లో యాక్టివ్‌గా ఉండాలని చెప్పారు. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సలహా ఇచ్చారు. అవసరమైతే ఎక్స్‌పర్ట్స్‌ సూచనలు తీసుకుని మరీ క్యాంపెయినింగ్ చేయాలని ఎంపీలకు చెప్పారు. కొత్త ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టడం కన్నా ఇప్పటి వరకూ చేసింది చెప్పుకుంటే చాలని అన్నట్టు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. అందరూ గ్రౌండ్‌ లెవెల్‌లో పని చేసి ప్రజల మెప్పు పొందాలని సూచించినట్టు తెలిపాయి. ప్రస్తుతానికి బీజేపీ నేతృత్వంలోని NDA కూటమిలో 430 మంది ఎంపీలున్నారు. వీళ్లను 11 గ్రూప్‌లుగా విభజించింది బీజేపీ. జులై 31వ తేదీ నుంచి వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 10వ తేదీ వరకూ ఇవి కొనసాగనున్నాయి.ఇటీవలే ఉత్తర ప్రదేశ్‌ ఎంపీలతో ప్రధాని సమావేశమయ్యారు. రామమందిరం మినహా.. ఇతర సమస్యలపై ఎంపీలు దృష్టి సారించాలని సూచించారు. తరచూ ప్రజల్లోకి వెళ్లాలని, వారితో మమేకం అవ్వాలని, ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎంపీలతో సమావేశంలో యూపీఏపై విమర్శలు గుప్పించారు ప్రధాని. యూపీఏ స్వార్థం గురించి ఆలోచిస్తే,, ఎన్డీఏ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తుందన్నారు. యూపీఏ మాదిరి కాకుండా ఎన్డీఏ త్యాగాలకు సిద్ధంగా ఉంటుందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్