తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు..
No suspension on Tahsildar..కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్
బద్వేలు
విదుల్లో చేరకుండా.. ఉద్యోగ నియమ,నిబంధనలను ఉల్లంఘించి, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేసిన తహశీల్దార్ యు. దస్తగిరయ్యను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు.
సాధారణ బదిలీల్లో భాగంగా.. తహశీల్దార్ యు. దస్తగిరయ్యను తిరుపతి జిల్లా నుండి వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలోని కెఆర్ఆర్ సి తహశీల్దార్ గా.. ఉన్నతాధికారులు బదిలీ చేశారు. నిర్ణీత గడువు లోగా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి వుండగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. వెంటనే విధులలో చేరాలని ఫోన్ ద్వారా చెప్పడమే కాకుండా, జిల్లా కలెక్టర్ మెమో కూడా జారీ చేశారు. అయినా కూడా ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. విధులలో చేరకుండా .. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న తహశీల్దార్ యు.దస్తగిరయ్యను ఏపీ సివిల్ సర్వీసెస్ (సి.సి.&ఏ) రూల్స్, 1991 రూల్ 8, సబ్ రూల్ (1) మేరకు సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులను జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించినా, ఉన్నతాధికారుల ఆదేశాలను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




