- Advertisement -
టాటా ట్రస్ట్ ఛైర్మన్ గా నోయెల్ టాటా నియామకం
Noel Tata appointed as Chairman of Tata Trust
న్యూఢిల్లీ అక్టోబర్ 11
పారిశ్రామికవేత్త రతన్ నావల్ టాటా(86) పరమపదించడంతో ఆయన స్థానంలో టాటా ట్రస్ట్ కు ఆయన సవతి సోదరుడు నోయెల్ టాటా నియమితులయ్యారు. టాటా ట్రస్ట్ అనేది టాటా గ్రూప్ దాతృత్వ సంస్థ. నోయెల్ టాటా నియామకాన్ని టాటా ట్రస్ట్ శుక్రవారం ఉదయం ప్రకటించింది. నోయెల్ ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ సంస్థలకు ఛైర్మన్ గా ఉన్నారు. అంతేకాక ఆయన టాటా స్టీల్, టైటాన్ సంస్థలకు వైస్ ఛైర్మన్ గా కూడా ఉన్నారు. రతన్ టాటా, నోయెల్ కు మధ్య సంబంధాలు చాలా ఏళ్లుగా లేవనే చెప్పాలి. నోయెల్ నియామక ప్రకటన వచ్చేంత వరకు రతన్ టాటా వారసుడెవరన్నది సస్పెన్స్ గా ఉండింది. కానీ శుక్రవారం మధ్యాహ్నం ప్రకటన వచ్చాక అంతా స్పష్టమైపోయింది.ఇదిలావుండగా రోజువారీ కార్యకలాపాలు మాత్రం టాటా సన్స్ ఛైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖరన్ నిర్వహణలోనే నడువనున్నాయి.
- Advertisement -