కోలహాలంగా బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్
తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ శుక్రవారం కోలాహలంగా సాగింది. నియోజవర్గం నలుమూలల నుంచి భారీగా యువత, మహిళలు తరలివచ్చారు. ముందుగా బొలిశెట్టి నివాసం నుంచి బయలుదేరి కే పెంటపాడు వేణుగోపాలస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా కే పెంటపాడు నుంచి తాడేపల్లిగూడెం చేరుకున్నారు. కేరళ నృత్యాలు, తీన్మార్ డప్పులతో ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు, నాయకులు తోట గోపి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, రెండు జిల్లాల కూటమి అబ్జర్వర్ రవి తోపాటు నియోజవర్గ స్థాయి నాయకులు తరలివచ్చారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి బొలిశెట్టి తన నామినేషన్ పత్రాలను కూటమి నాయకులతో కలిసి అందించారు.