- Advertisement -
ఖమ్మం బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్
ఖమ్మం ఏప్రిల్ 24
ఖమ్మం బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి గౌతమ్ కు నామినేషన్ పత్రాలు అందించారు. మూడు సెట్ల నామినేషన్ పత్రాలను నామా నాగేశ్వరరావు దాఖలు చేశారు. నామా వెంట మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎంపిలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, మదన్ లాల్, కొండబాల కోటేశ్వరరావు, తదితరలు ఉన్నారు.
- Advertisement -