అయోమయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉండిపోయింది. అధిష్టానం చెప్పకముందే నామినేషన్స్ వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. రేపే నామినేషన్ల గడువు ముగుస్తున్నా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు.
మరోవైపు కాంగ్రెస్ అధిష్టానాన్ని, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని లెక్క చేయకుండా ఇష్టమొచ్చినట్టు నామినేషన్లు వేసుకుంటున్నారు అభ్యర్థులు.అధిష్టానం ప్రకటించకున్నా ఇప్పటికే మంత్రి పొంగులేటి తన వియ్యంకుడైన రఘురాం రెడ్డితో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేపించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు పట్టి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి కాకుండా వెలిచాల రాజేందర్ రావుతో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు. అధిష్ఠానం ప్రకటించకున్నా ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు నామినేషన్లు వేస్తున్నారంటూ అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్ ఉండిపోయింది.