Sunday, February 22, 2026

ఆగని బుల్డోజర్ సెగలు

- Advertisement -

ఆగని బుల్డోజర్ సెగలు

Non-stop bulldozer seconds

హైదరాబాద్, సెప్టెంబర్ 26, (వాయిస్ టుడే)
అక్రమార్కులను హడలెత్తిస్తోన్న హైడ్రా, ఇప్పుడు సూపర్‌ పవర్‌. ఇప్పటికే తెలంగాణ కేబినెట్‌ హైడ్రాకు చట్టబద్దతకల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.. మిషన్‌ మూసీ ప్రక్షాళనలో హైడ్రాకు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. తాజాగా హైడ్రాలో కొత్తగా 169 సిబ్బందిని కేటాయించారు. డిప్యుటేషన్‌పై వివిధ విభాగాల్లోని సిబ్బందిని హైడ్రాకు అటాక్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఇన్‌స్పెక్టర్లు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లు సహా సైంటిస్ట్‌, తహసీల్దార్లు, సర్వేయర్‌ ,ఫారెస్ట్‌ ఆఫీసర్‌తో హైడ్రా మరింత బలోపేతమైంది.తిరుగులేని బాణంలా దూసుకెళ్తోన్న హైడ్రా.. ఇప్పుడు మరింత బలోపేతం అవుతుంది. చెరువులు, నాలాలపై కబ్జాల కబ్జాల తొలగింపుకు సీఎం రేవంత్‌ రెడ్డి హైడ్రాకు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చారు. అయితే, ఆక్రమణలను తొలగించడం మంచిదే.. కానీ సంపన్నుల విషయంలో ఒకలా.. నిరుపేదల విషయంలా మరోలా వ్యవహరిస్తున్నారని కన్నెర్ర చేస్తున్నాయి విపక్షాలు.హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తున్నారన్నారని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా వుంటుందన్నారు. అవసరమైతే బుల్డోజర్‌కు అడ్డుగా తాము నిలబడుతామన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా లీగల్‌ ఎయిడ్‌ అందిస్తామన్నారు.హైడ్రా ముసుగులో పేదలపై దుర్మార్గపు చర్యలను ఆపాలన్నారు బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్‌. లేదంటే ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ సర్కారు తప్పుల చిట్టాను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈటల చెప్పారు.హైడ్రా యాక్టివిటీ హద్దుల్లో ఉండాలంటున్నాయి విపక్షాలు .పర్యావరణ పరిరక్షణే లక్ష్యం.. చెరువులు, నాలాలపై కబ్జాలను తొలగించడమే మార్గం అంటూ హైడ్రాను మరింత స్ట్రెంథెన్‌ చేస్తోంది సర్కార్‌. సవాళ్లు -ప్రతిసవాళ్లతో బుల్డోజర్‌ పాలిటిక్స్ మరింతగా హీటెక్కుతున్నాయి.
మూసి ప్రాంతాల్లో సర్వే
మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన ప్రాంతాలను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 16 బృందాలు సర్వే చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో నాలుగు బృందాలు .. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 5 బృందాలు పర్యటిస్తున్నాయి.మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న బఫర్‌ జోన్‌లో సర్వే కొనసాగుతుంది. గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్‌, ఆశ్రమ్‌నగర్‌లో కొలతలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు వాటికి మార్క్‌ చేస్తున్నారు. మార్క్‌ చేసిన నిర్మాణాలను త్వరలో కూల్చివేస్తామంటున్నారు అధికారులు.పాతబస్తీ పరిధిలోని చాదర్‌ఘాట్‌, మూసానగర్, శంకర్‌నగర్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఆక్రమణలను గుర్తించి కూల్చివేసే నిర్మాణాలకు మార్క్‌ చేస్తోన్నారు. సాయంత్రం వరకు సర్వే కొనసాగనుంది.సర్వే కోసం వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్నారు. తామంతా పేదవాళ్లమని.. ఇప్పటికిప్పుడు నివాసాలు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లి బతకాలని ప్రశ్నిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపేవరకు ఇళ్లను కూల్చొద్దని వేడుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్