Sunday, September 8, 2024

కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదు: షర్మిల

- Advertisement -

వైఎస్ ఆర్ ఫ్యామిలీకి సోనియా అన్యాయం చేయలేదు

కడప, సెప్టెంబర్ 2:   వైఎస్ఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఎలాంటి ద్రోహం చేయలేదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల స్పష్టం చేశారు. ఇడుపులపాయలో వైఎస్ కు నివాళులు అర్పించిన తర్వాత హైదరాబాద్ వచ్చిన ఆమె పంజాగుట్టలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తో కీలక వ్యాఖ్యలు చేశారు.  జగన్ అక్రమాస్తుల కేసులోని ఎఫ్ఐఆర్‌లో వైఎస్ఆర్ పేరు కూడా ఉందని.. చనిపోయిన వైఎస్ పేరు ఎఫ్ఐఆర్‌లో  చేర్చడానికి కారణం సోనియా గాంధీ అని ని మా వాళ్లు కూడా నన్ను ప్రశ్నించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ విగ్రహం సాక్షిగా ఒక  విషయం చెప్పాల్సి ఉందని.. తాను ఈ విషయం చెప్పకపోతే  వైఎస్సార్ అభిమానులకు అసలు విషయం తెలియదన్నారు. వైఎస్ఆర్ బతికి లేకపోయినా అక్రమాస్తుల కేసుల్లోని ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు ఎందుకు ఉందని.. తాను సోనియా గాంధీ వద్ద ప్రస్తావించానని  షర్మిల చెప్పారు.  రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా CBI ఛార్జ్ షీట్ లో పేరు చేర్చారు అని సోనియా గాంధీ తమకు చెప్పారని..  ఆ బాధ ఎంటో మాకు తెలుసు అని అన్నారని షర్మిల స్పష్టం చేశారు.  మాకు తెలిసి తెలిసి అలాంటి అవమానం మేము ఎలా చేస్తాం అన్నారన్నారు.  వైఎస్సార్ పై మాకు అపార మైన గౌరవం ఉంది .. వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తామని అన్నారని షర్మిల గుర్తు చేసుకున్నారు.  వైఎస్సార్ లేని లోటు మాకు ఈ రోజు కూడా తెలుస్తుందని సోనియా బాధపడ్డారని షర్మిల తెలిపారు.  సోనియాతో మాట్లాడిన తర్వాత తనకు అర్థమైంది ఏమిటంేట…  వాళ్ళు తెలియక చేసిన పొరపాటేనని..  కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదని షర్మిల క్లీన్ చిట్ ఇచ్చారు. వైఎస్సార్ ను సోనియా , రాహుల్ అపారంగా గౌరవం ఇస్తున్నారని స్పష్టం  చేశారు. ఈ అంశంపై తాను నిర్ధారణకు వచ్చిన తర్వాతే సోనియా తో ,రాహుల్ తో చర్చలు జరిపానని తెలిపారు. వాళ్లు   రియలైజేషన్ కి వచ్చారు ..  అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తనదని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ తో ఎలా కలిసి పనిచేయాలనే విషయం పై సోనియాతో చర్చించామమని షర్మిల తెలిపారు.  సోనియాతో చర్చలు బయటపెట్టడం సరికాదన్నారు.  కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడమే మా లక్ష్యమని తెలిపారు. తాను నిలబడతా.. కార్యకర్తలను నిలబెడతానని ప్రకటించారు.  పార్టీ కార్యకర్తలు బాగుండాలనేదే తన ప్రయత్నమన్నారు.  సోనియాతో జరిగిన చర్చలు బయటకు చెప్పని షర్మిల.. పాలేరు లో పోటీ అంశం త్వరలో వెల్లడిస్తానన్నారు

Not a deliberate mistake by Congress: Sharmila
Not a deliberate mistake by Congress: Sharmila

పార్టీ విలీనంపై షర్మిల

ఇది వైయస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం మంచి పద్ధతి కాదని అందుకే ఇక్కడ రాజకీయాలు మాట్లాడని షర్మిల స్పష్టం చేశారు పార్టీ విలీనంపై ఇక్కడ మాట్లాడటం సభ్యత కాదని అందుకే ఇక్కడ మాట్లాడటం లేదని షర్మిల తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్