Wednesday, March 11, 2026

ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదు కేటీఆర్

- Advertisement -

ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదు
కేటీఆర్
హైదరాబాద్

Not a single Select Committee, Standing Committee, or Petitions Committee exists.
— KTR
గండిపేటలోని గోల్కొండ రిసార్ట్లో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ సమావేశం ముగిసిన తరువాత  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  మీడియాతో మాట్లాడారు.
ఈసారి కాంగ్రెస్ పెడుతున్న బడ్జెట్ మూడవ బడ్జెట్. ఈసారి బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయింది. హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయింది. వారి హామీల అమలు వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల పైన ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన చర్చించాం. మా పార్టీ సీనియర్ నేతలు మధుసూదనాచారి, బండ ప్రకాష్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా అసెంబ్లీలో ఏ కమిటీలను వేయడం లేదని అన్నారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మా పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారు. ఒక్క సెలెక్ట్ కమిటీ లేదు, స్టాండింగ్ కమిటీ లేదు, పిటిషన్స్ కమిటీ లేదు. ఇలా డెప్యూటీ స్పీకర్ కూడా శాసనసభలో లేరు. కేవలం అనివార్యంగా శాసనసభ సమావేశాలను నడిపించాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం బలవంతంగా నడిపిస్తున్నది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మందబలంతో బుల్డోజర్ టాక్టిక్స్ను ప్రయోగిస్తున్నది.
శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అబద్ధాలను, అసత్యాలను పచ్చిగా మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ శాసనసభ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నది. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ రెండున్నర సంవత్సరాల తర్వాత కూడా చట్టబద్ధత పక్కన పెట్టి కనీసం అమలు కూడా చేయడం లేదు. అందుకే ఈ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును మా పార్టీ తరపున తీసుకురావడానికి  ప్రయత్నం చేస్తాం. మేము పెట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్తున్న రేవంత్ రెడ్డి రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకం వల్ల ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున, మూసీ బాధితుల తరపున, పేద దళిత, గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను అంకెలతో సహా ఎండగట్టాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్