Sunday, September 8, 2024

కాంగ్రెస్ కాదు.. స్కాంగ్రెస్

- Advertisement -

కేటీఆర్  ట్వీట్

మెదక్ సెప్టెంబర్ 30:   తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ పై కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. కర్ణాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఎన్నికలకు నిధులు సమీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు బిల్డర్లపై పన్నులు వేస్తోందని విమర్శించారు. రాజకీయ ఎన్నికల పన్ను చదరపు అడుగుకు రూ.500 చొప్పున ప్రారంభమైందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ట్విట్టర్ ఆరోపించింది. అంతేకాకుండా గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌.. స్కామ్‌ల వారసత్వంతో స్కాంగ్రెస్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కర్నాటక నిధులు తీసుకొచ్చి ఎన్ని ఖర్చు చేసినా ఇక్కడి ప్రజలను మోసం చేయలేరని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని స్పష్టం చేశారు.అయితే తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలపై ట్విట్ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం..వంచన.. ద్రోహం.. దోఖాలమయం అని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇది..మీ కపట కథలు..కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ..! అన్నారు. కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవ్ ఇక్కడ..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబందుల రాజ్యమొస్తే రైతుబంధు రద్దవడం గ్యారెంటీ..! అన్నారు. కాలకేయుల కాలం వస్తే.. కరెంట్‌ కోతలు..కటిక చీకట్లు గ్యారెంటీ..! అని నిప్పులు చెరిగారు. మూడు రంగుల ఊసరవెల్లిని నమ్మితే మూడు గంటల కరెంటే గతి అంటూ మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఊడగొట్టడం గ్యారెంటీ..! అన్నారు. దగాకోరుల పాలనొస్తే.. ధరణి రక్షణ ఎగిరిపోవడం గ్యారెంటీ..! తెలిపారు. బకాసురులు గద్దెనెక్కితే రైతుబీమా..ధీమా గల్లంతవ్వడం గ్యారెంటీ..! అంటూ ట్వీట్ వైరల్ అయ్యింది.

not-congress-sangres
not-congress-sangres
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్