అసత్య ఆరోపణలు కాదు.?
Not false accusations.?
మేము మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం..
మీరు మాపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా.?
కౌతాళం ఉ
అసత్య ఆరోపణలు కాదు నిజాలు మేము మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాము. మీరు మాపై చేసిన ఆరోపణలకి కట్టుబడి ఉన్నారా అని మంత్రాలయం నియోజకవర్గ జనసేన నాయకులు అనుమేష్, రామాంజినేయులు, గణేష్, యేసేబు, రాంబాబు, మమ్మద్, రాజు, సత్య, రమేష్, మారుతీ, లక్ష్మన్న, సాయిబాన్న,మారెప్ప, తదితరులు అన్నారు. ఈ మేరకు మండల కేంద్రమైన కౌతాళం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యా లక్ష్మన్న మళ్ళీ అడుగుతా ఉన్నాం. కార్యకర్తలను నాయకులను గ్రూపులుగా విడదీస్తూ పార్టీ ఆదేశాలు లేకుండా మండల అధ్యక్షులను, కన్వీనర్ లను నిర్మించింది మీరు కాదా 2019 కి ముందు మీరు ఎవరు 2019 ఎలక్షన్ క్యాంపియన్ విషయంలో కార్యకర్తలకు కనీసం భోజనాలు అయినా ఏర్పాటు చేసారా. జనసేన కార్యకర్తలు నాయకులు వైసిపి వాళ్ళకి అమ్ముడుపోయారని మీరు చెప్పలేదా. 2019 లో మీరు ఎవరికి కొమ్ము కాసారో పార్టీని ఎవరికి తాకట్టు పెట్టారో మీరు ఎవరెవరితో డబ్బులు తీసుకున్నారో ఆధారలతో సహా మా దగ్గర ఉన్నాయి దానికి కట్టుబడి ఉన్నాము. 2024 ఎలక్షన్ లో కూడా మీరు ఎవరికి మద్దతుగా ఉన్నారో తెలుసు. పార్టీ ఆదేశించిన 35 సభ్యత్వాలు చేశారా. నాలుగవ విడత క్రియశీలక సభ్యత్వలలో మేము 1303 సభ్యత్వలు చేసాము. మీరు ఎన్ని చేసారో చెప్పండి. ఒక జనసేన కార్యకర్త ఇల్లు ఓపెనింగ్ కోసం పిలిస్తే మీకు మంచి గౌరవాన్ని ఇస్తే మీరు వెయ్యి రూపాయలు డీజిల్ కి తీసుకెళ్ళారా లేదా. జనసేన లోకి వచ్చి నేను నాశనం అయ్యాను అన్నారా లేదా. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో జనసేన కార్యకర్తలు ఎంత మంది ఉన్నారో చెప్పండి. మీరు చేసిన ఆరోపణల మీద మేము లీగల్ గా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే పార్టీ అధిష్టానానికి మేము ఆల్రెడీ తెలియజేశాము.మీకు దమ్ముంటే మీరు తెలియజేయండి. ఈ కార్యక్రమం లో నాలుగు మండలాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.