Sunday, December 22, 2024

జీతం కోసం కాదు జీవితం కోసం ఉద్యోగం ముఖ్యం..

- Advertisement -

జీతం కోసం కాదు
జీవితం కోసం ఉద్యోగం ముఖ్యం..

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్

చిన్న ఉద్యోగం
వచ్చినా వదులుకోవద్దు.
జాబ్ మేళాకు హాజరైన వారు
ఆఫర్ లెటర్లతో ఇంటికెళ్లాలి.
నేను నాలుగు ఉద్యోగాలు
మారి ఈ స్థాయికి వచ్చా.
కష్టపడితే తప్పకుండా
ఫలితం ఉంటుంది.
కొత్తపెల్లిలో మానకొండూర్ ఎమ్మెల్యే సతీమణి అనురాధ తో కలిసి మెగా జాబ్ మేళాను ప్రారంభించిన జిల్లా కలెక్టర్,
జీతం కోసం కాదు.. జీవితం కోసం ఉద్యోగం ముఖ్యమని, ముందుగా చిన్న ఉద్యోగం వచ్చిన వదులు కోవద్దని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్ లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ  నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మానకొండూరు ఎమ్మెల్యే సతీమణి కవ్వంపల్లి అనురాధ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గం నుంచి మెగా జాబ్ మేళాకు సుమారు 6000 మంది హాజరయ్యారని తెలిపారు. అందరూ దాదాపు ఉద్యోగాలు పొంది ఆపర్ లేటర్లతో ఇంటికెళ్లాలని సూచించారు. తాను నాలుగు ఉద్యోగాలు మారి ఈ స్థాయికి వచ్చానని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహిస్తున్నదని, నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. 68 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని, ఇందులో 25 కంపెనీలు స్పాట్లోనే ఉద్యోగాలకు ఎంపిక చేసే ఆఫర్ లేటర్లు ఇస్తున్నారని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, లేకపోతే కుటుంబాలు చిన్నబిన్నమవుతాయని పేర్కొన్నారు. ఏ ఉద్యోగం వచ్చినా ముందడుగు వేయాలని, చిన్న పెద్ద తేడా లేకుండా ముందుకెళ్లాలని సూచించారు. చాలామంది యువత దళారులకు డబ్బులు అందిస్తూ ఉద్యోగాల పేరిట మోసపోతున్నారని పేర్కొన్నారు. కంపెనీలే మన ముందుకు వచ్చి ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం అభినందనీయమని చెప్పారు. మహిళలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు పొందాలని సూచించారు. మానకొండూర్ ఎమ్మెల్యే సతీమణి కవ్వంపల్లి అనురాధ మాట్లాడుతూ పురుషులకు దీటుగా మహిళలు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఉద్యోగం అవసరమని పేర్కొన్నారు. అవకాశాలను వినియోగించుకొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే సతీమణి ఉద్యోగాలు సాధించిన వారికి ఆఫర్ లేటర్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డివైస్ ఓ శ్రీకాంత్ రెడ్డి, తహసిల్దార్ కనకయ్య ఎంపీపీలు ముద్దసాని సులోచన శ్రీనివాస్ రెడ్డి, వుట్కూరి వెంకటరమణారెడ్డి నాయకులు మోరపల్లి రమణారెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి చింతల లక్ష్మారెడ్డి, వినయ్ కుమార్, పులి కృష్ణ, శ్రీనాథ్ రెడ్డి, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్