Tuesday, March 17, 2026

నాగబాబుకు టీటీడీ కాదు.. కేంద్ర మంత్రి పదవి..?

- Advertisement -

నాగబాబుకు టీటీడీ కాదు.. కేంద్ర మంత్రి పదవి..?

అన్నకు ప్రేమతో.. తమ్ముడు….!

కాపు కార్పొరేషన్,దుర్గగుడి చైర్మన్, ఎమ్మెల్సీ రేసులో జనసేన

అమ్మిశెట్టి వాసు,బాడిత శంకర్,చిల్లపల్లి లకు.. గ్రీన్ సిగ్నల్!

అమరావతి

అనకాపల్లి ఎంపీ సీటు.. నాగబాబుకు మొదట కేటాయించగా.. కూటమిని నిలబెట్టడం కోసం.. ఆ ఎంపీ సీటును పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సి వచ్చింది.

అయితే గత కొద్ది రోజులుగా.. నాగబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి లభిస్తుందని ప్రచారం జరుగుతుండగా… దానిని నాగబాబు ఖండించారు…!

త్వరలోనే రాజ్యసభ సీటు తో పాటు.. కేంద్ర మంత్రి పదవి… కట్టబెట్టి క్యాబినెట్ హోదా.. కల్పించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

జనసేన ఎంపీ బాలసౌరిని పక్కన పెట్టి… కేంద్ర మంత్ర పదవిని.. నాగబాబు కోసం రిజర్వ్ చేసినట్లు.. తెలుస్తుంది…!

పిఠాపురం… ఎమ్మెల్యే పదవి.. త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఆఫర్ చేయగా… అదే స్థాయిలో… 2019లో కమ్యూనిస్టుల కోసం ఒకసారి 2024లో నారా లోకేష్ కోసం మరోసారి… ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన… జనసేన పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు… పేరు టిటిడి చైర్మన్ రేసులో.. వినిపిస్తున్నాయి…!.. ఒకవేళ టీటీడీ చైర్మన్ దక్కకపోతే… బోర్డు మెంబర్ గాని… సంవత్సరం తర్వాత ఎమ్మెల్సీ గాని… ఆయనకి ఇవ్వాలని నారా లోకేష్, పవన్ కళ్యాణ్… ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది…!

ఇప్పటికే దుర్గ గుడి చైర్మన్ పదవికి బాడిత శంకర్ పేరు ముందు వరుసలో ఉండగా… దీనికి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేసినేని చిన్ని అండదండలు ఉండగా…. తాజాగా వంగవీటి రాధా సైతం శంకర్ కు మద్దతుగా రంగంలోకి దిగారు. దీన్ని బట్టి చూస్తే… జనసేనకే చైర్మన్ హోదా దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా… కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా.. జనసేనకే దక్కే అవకాశాలు ఉన్నాయి.!

దశాబ్ద కాలంగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న జనసేన నేత అమ్మిశెట్టి వాసు…కాపు కార్పొరేషన్ చైర్మన్ రేస్ లో మొదటి వరుసలో ఉన్నారు….!

ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలను అప్పచెప్పి… పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమికి ఎంత ముఖ్యమో… ప్రజలకు ఒక సందేశాన్ని పంపించగా….. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా… ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు… ఉప ముఖ్యమంత్రి హోదాలో… పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఏర్పాటు చేశారు….! పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఏ స్థాయిలో ఉందో…. చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే…!

నామినేటెడ్ పోస్టుల్లో… జనసేనకు అగ్ర పీఠం ఇచ్చి తమ బంధాన్ని ఇంకా..దృడం చేసుకోవాలని తెలుగుదేశం భావిస్తోంది….!.. త్వరలోనే….టిటిడి బోర్డు చైర్మన్ లేదా బోర్డు మెంబర్లు, ఎమ్మెల్సీలు, దుర్గగుడి చైర్మన్, కాపు కార్పొరేషన్ చైర్మన్… తోపాటు స్థానికంగా ఉండే నామినేటెడ్ పోస్టులలో జనసేన క్యాడర్ ని చూడవచ్చు…..!

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్