- Advertisement -
ఖాళీలు వస్తే ప్రతీ ఏటా నోటిఫికేషన్స్: మంత్రి బొత్స
విజయవాడ ఫిబ్రబవరి 12
ఉపాధ్యాయ నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పూర్తి అయితే జీరో వేకెన్సి అవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఖాళీలు వస్తే ప్రతీ ఏటా నోటిఫికేషన్‌లు జారీ చేస్తామని..
cs.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు దాఖలు చేయొచ్చునని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏపీలో 6,100 ఖాళీలు మాత్రమే ఉన్నాయన్నారు.
పార్లమెంటులో చెప్పిన ఖాళీల విషయం సత్యదూరమని, ఏపీ నుంచి ఖాళీల వివరాలు కేంద్రానికి ఇవ్వలేదంటూ పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు.
- Advertisement -