ఎన్టీఆర్ కు 6 నుంచి 8 వారాల రెస్ట్
హైదరాబాద్, ఆగస్టు 13
NTR advised 6 to 8 weeks of rest.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి డాక్టర్స్ విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. జులై 27న జిమ్‌లో ఎక్సర్ సైజ్ చేస్తున్న టైంలో భుజానికి గాయం కాగా వైద్యుల సూచన మేరకు ఆయన సర్జరీ చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ జె.మధూసూదన్ రావు, డాక్టర్ ఆర్ఏ పురంచంద్ర తేజస్వి నేతృత్వంలో వైద్యుల బృందం ఆయనకు సక్సెస్ ఫుల్‌గా సర్జరీ కంప్లీట్ చేసింది.ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని… ఆయనకు 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. ఆ తర్వాతే ఆయన షూటింగ్స్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఇంజ్యూరీ ఎలాంటి సర్జరీ అవసరం లేకుండానే నయం అవుతుందని భావించారు. అయితే, రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డాక్టర్ల సూచన మేరకు ఎన్టీఆర్ సర్జరీ చేయించుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. తిరిగి షూటింగుల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నారు.ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఓపియమ్నల్లమందు సాగు, డ్రగ్స్ బేస్ట్ స్టోరీతో పాటు ముంబై అండర్ వరల్డ్ మాఫియా, ఆసియా దేశాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా మూవీని రూపొందించినట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోందిఈ మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, నందమూరి కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా… వచ్చే ఏడాది జూన్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.




