30.8 C
New York
Sunday, June 23, 2024

బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్‌టీఆర్‌దే:-జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

- Advertisement -

బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత ఎన్‌టీఆర్‌దే

-అణగారిన వర్గాలు కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాలే

-జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని

ఆనాడు పటేల్‌ పట్వారీ దొర బాంచెన్‌ అనే పరిస్థితుల నుంచి బీసీలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుదేనని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.
మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టీ రామారావు జయంతి సందర్బంగా మంథని పట్టణంలోని ఎన్‌టీఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈసందర్బంగా పుట్ట మధు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మంది మహనీయులు త్యాగాలు చేశారని, అలాంటి మహనీయుల విగ్రహాల వెనుక దాగి  ఉన్న చరిత్రను తెలియజేయాలనే ఆలోచనతో

మంథనిలో విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. అయితే ఆనాడు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు నేలవంక కింద చూసి నడిచే వారని కనీసం పెద్దవాళ్లను తల ఎత్తి చూసేవారు కాదన్నారు. అలాంటి

పరిస్థితులను మార్చిన చరిత్ర ఎన్‌టీఆర్‌దేనని అన్నారు. ఈనాడు బీసీలు రాజకీయంగా ఇంత ఎత్తు ఎదిగారంటే అందుకు ఎన్‌టీ రామారావు కారణమన్నారు.  ఎన్‌టీఆర్‌ రాకముందు కాంగ్రెస పార్టీ తమ చెక్కు చేతల్లో

ఉండే వాళ్లను మాత్రమే రాజకీయంగా వాడుకునే వారని, ఎస్సీల్లో రిజర్వేషన్‌లు ఉన్నా స్వతంత్ర ఆలోచన శక్తి ఉండేది కాదన్నారు. ఈ క్రమంలో ఎన్‌టీఆర్‌ ఎస్సీలను ముందుకు తీసుకువచ్చి రాజకీయ అవకాశాలు

కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే మనం ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు. మంథని నియోజకవర్గంలో చరిత్ర లేని ఒక వ్యక్తిని పూజించాలని కాంగ్రెస్‌ నాయకులు

ఒత్తిడి తెస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు ఇప్పటికైనా కళ్లు తెరిచి మహనీయుల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలని బుక్కు పట్టుకుని

తిరుగుతున్న రాహుల్‌ గాంధీ మంథని నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నాయకుల కళ్లు తెరిపించాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏగోళపు శంకర్ గౌడ్, కౌన్సిలర్ కాయితి

సమ్మయ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాదాడి శ్రీనివాస్ రెడ్డి, తగరం శంకర్ లాల్, ఆకుల రాజబాబు, బత్తుల సత్యనారాయణ, ఆసిఫ్ ఖాన్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!