పరవాడలో ఘనంగా నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాలు

- Advertisement -

పరవాడలో ఘనంగా నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాలు

Nutritional month festivals organized grandly in Paravada

పరవాడ

పరవాడ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం లో ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు హాజరయ్యారు. ముందుగా పౌష్టికాహార కిట్లు పంపిణీ చేయడం తో పాటు సిబ్బంది తయారు చేసిన వంటకాలను పరిశీలించి రుచి చూసారు.గర్భిణీ స్త్రీలుకు సీమంతాలు ఏర్పాటు చెయ్యగా వారికి ఆశీర్వచనాలు అందచేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు  మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యామని అంగన్వాడీ పిల్లలకు, గర్భిణి స్త్రీలకు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహార పదార్ధాలు పూర్తి స్థాయిలో అందేలా కృషి చేయాలని అంగన్వాడీ కార్యకర్తలను అన్నారు. మరియు గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతంలో భాగంగా పాలు, పండ్లు, గుడ్లు, బియ్యం, పప్పు తదితర పౌష్టిక ఆహార పదార్థాలు అందజేసి పౌష్టికాహార ఆవశ్యకతపై వివరించి,తల్లులకు పిల్లలకు పౌష్టికాహారం అందించడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని అన్నారు గర్భవతులకు పౌష్టికాహారం అందించడం వలన తల్లికి పుట్టిన బిడ్డకి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు అంగన్వాడి కేంద్రంలో ప్రభుత్వం గుడ్డు పాలు అన్నం కూరలతో మంచి బలవర్ధకమైన ఆహారం అందించడం జరుగుతుందని మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లి పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.పౌష్టికాహార ప్రయోజనాలపై ఆమె అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక బలాన్ని ఇచ్చే ఆకుకూరలు పండ్లు కూరగాయలు పాలు ఎక్కువగా తీసుకొని రక్తహీనత పౌష్టికాహార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు.ఈ యొక్క కార్యక్రమంలో సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు,మాజీ సర్పంచ్ చుక్క రాము నాయుడు, ఉప సర్పంచ్ బండారు రామారావు, బీజేపీ నాయకులు కుండ్రాపు సోము నాయుడు, వర్రీ హరి, అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు , ఎ.ఎన్. ఎం లు రత్నం, ఇందిరా, ఆశ కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, తల్లులు, కిశోర బాలింతలు, బాలికలు , తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular