పౌష్టికాహారమే ఆరోగ్యానికి మేలు -ఎమ్మెల్యే శ్యాంబాబు
Nutritious food is good for health - MLA Shyam Babu
పోషణ మాసోత్సవ కార్యక్రమం
ఐసిడిఎస్ సిడిపిఓ లలిత
పత్తికొండ
పౌష్టికాహారం తీసుకో వడం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని పత్తికొండ నియోజవర్గం ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు పత్తికొండ పట్టణంలో గల ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణలో ఐసిడిఎస్ సిడిపిఓ లలిత ఆధ్వర్యంలో పోషకాహార మాసోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించి
గర్భి ణులు, బాలింత లు, చిన్నారులు పౌష్టిక ఆహారము మరియు కూర గాయలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు చిరు ధాన్యాలు, తీసుకో వడం వలన కలిగే లాభాలను వివ రించారు అనంతరం,ఆర్డీవో నీలపు రామలక్ష్మి పాల్గొని వారు మాట్లాడుతూ పౌష్టికాహార లోపం వల్ల మాతా, శిశు మరణాలు, బరువు తక్కువ పిల్లలు జన్మిస్తున్నారు. ఆరేళ్లలోపు చిన్నారులలో ఎదుగుదల సరిగా ఉండటం లేదు. మహిళలు, కిశోరా బాలికలలో రక్తహీనత సమస్య వెంటాడుతూనే ఉంది. వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌష్టికాహార మిషనను ప్రారంభించింది. పౌష్టికాహార మాసోత్సవాన్ని నిర్వహిస్తూ, అంగనవాడీ కేంద్రాలు ద్వారా పౌష్టికాహార ప్రాధాన్యం, సమస్య నివారణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, గర్భవతులు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలపై కుటుంబ సభ్యులకు సైతం అవగాహన కల్పించాలని, 18 ఏళ్లు నిండకుండా ఎవరైనా గ్రామాల్లో పెళ్లిళ్లు చేస్తే తమ దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, టిడిపి నాయకులు, సాంబశివారెడ్డి, రామనాయుడు, బత్తిని లోకనాథ్, శ్రీధర్ రెడ్డి, బత్తిని వెంకట రాముడు, బీటీ గోవిందు , కె. పి బ్రహ్మయ్య, మీరాహుస్సేన్ , కొత్తూరు నాగేష్ , సత్య ప్రకాష్ ,పాల్గొన్నారు.