Thursday, March 27, 2025

దండు మారెమ్మ జాతరలో అశ్లీలం..

- Advertisement -

దండు మారెమ్మ జాతరలో అశ్లీలం..
బూతు…బూతు
తిరుపతి, మార్చి 24, ( వాయిస్ టుడే)

Obscenity at the Dandu Maremma fair..

ఏదైనా పండుగలు, జాతరలు, తిరునాళ్లు సమయంలో పల్లెల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలు పేరుతో గ్రామాల్లో రికార్డింగ్ డాన్స్‌లు నిర్వించేవారు. కొన్ని సార్లు డాన్స్ బేబీ డాన్స్‌తో అశ్లీల నృత్యాలు నిర్వహించేవాళ్లు. రాను రాను వీటిపై నిషేదించారు. చాలా ఏళ్ల నుంచి నిషేదం ఉన్నప్పటికీ.. గత కొంత కాలంగా రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువత చెడు వ్యసనాలకు బానిసవడంతో.. ఇలాంటి డాన్సులుపై నిషేదం విధించారు. అయినా సరే కొన్ని గ్రామాల్లో జాతరలు, పండుగల సమయంలో సాంస్కృతిక కార్యకాలాపాలు పేరిట అశ్లీల నృత్యాలు చేస్తూ వస్తున్నారు. ఇలాంటి కార్యాక్రమాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఇలాంటి ప్రోగ్రామ్‌లను అడ్డుకున్నప్పటీకీ.. మరికొన్ని చోట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తూ విమర్శలు పాలవుతున్నారు.ఇదిలా ఉంటే.. తాజాగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లో నిర్వహిస్తున్న దండు మారెమ్మ జాతర అభాసుపాలైంది. జాతరలో నిర్వహించకూడని డ్యాన్స్‌లను హిజ్రాల చేత యాథేచ్ఛగా చేయించారు జాతర నిర్వహకులు. అశ్లీల నృత్యాలతో పాటుగా జుగుప్సాకరంగా ఎలాంటి బట్టలు లేకుండా శరీర భాగాలు కనిపించే విధంగా డ్యాన్య్ లు చేశారు కొంతమంది హిజ్రాలు.ఈ వ్యవహారమంతా స్థానిక ముదివేడు పోలీస్ స్టేషన్ పోలీసులు గమనిస్తున్నా ఆ డ్యాన్స్ లను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఆ సమయంలో అక్కడే డ్యూటీలు చేస్తున్న ఇద్దరు ఎస్ఐలు తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరించారని స్థానికులు తెలిపారు. ఆ నృత్యాలను SI గాని సంబంధిత CI గాని ఎందుకు ఆపలేదని ? ప్రజలు విమర్శిస్తున్నారు. అత్యంత జుగుప్సాకరంగా ఉన్న విజువల్స్ చూస్తే పోలీసులే అశ్లీల డ్యాన్స్ లను ప్రోత్సహించారని, వారి సహాకారం ఉండటం వల్లే జాతర నిర్వహకులు ఈ తరహా డ్యాన్స్ లను నడిపిస్తున్నారని ప్రజలు పేర్కొన్నారు.దండు మారెమ్మ జాతర చిత్తూరు పడమటి మండలాల్లో ప్రేత్యేక గుర్తింపు పొందిన వేడుక. అయితే ఈ సారి ఆచారం పేరుతో అర్ధరాత్రి టైమ్‌లో అసభ్యకరమైన డాన్స్‌‌లు చేయడం, వేడుకను విచ్చలవిడిగా మార్చేయడం అందరిని షాంకింగ్‌కు గురిచేసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ట్రాక్టర్‌పై నగ్న దృశ్యాలతో డ్యాన్సులు చేయడం అత్యంత దారుణంగా ఉన్నాయి.ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఈ తరహా డ్యాన్స్ లు జిల్లాలో ఏ జాతరలో కూడా మరలా రీపీట్ కాకుండా చూడాలంటున్నారు ప్రజలు. దండు మారెమ్మ జాతర నిర్వహకులపై, డ్యూటీలో ఉన్న ఎస్ఐ లపై జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్