- Advertisement -
ధాన్యం కొనుగోళ్ల తీరు పరిశీలన
Observation of grain procurement pattern
ట్యాబ్ ఎంట్రీ వెంటనే చేయాలని ఆదేశం…
కమాన్ పూర్
ధాన్యం కొనుగోలు వెంటనే ట్యాబ్ లో ఎంట్రీ చేయాలని పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ కోరారు.
పాలకుర్తి మండలంలోని ఈసాలాతక్కలపల్లి ,కొత్తపల్లి ,బసంత్ నగర్ ,ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ సందర్శించారు.. సన్నరకాలను గుర్తించే పరికరాలు అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు , ఏవైనా అనుమానాలుంటే ఏఈవో ను సంప్రదించి గ్రెయిన్ కాల్లిపర్ పరికరంలో చూసి రైతులకు అవగాహన వారు కల్పిస్తారని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ఒకే అన్న తర్వాత మిల్లర్లు ఏమైనా ఇబ్బంది పెడితే వాటిని పరిష్కరించే బాధ్యతను సైతం ఏఈవోలకే అప్పగించారు.
ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో లేని వాటికి కేంద్రాల్లో ఏఈవోలు గ్రెయిన్ కాల్లిపర్ పరికరంతో గింజ పొడవు, వెడల్పు కొలతలు తీస్తారు. నిర్ణీత ప్రమాణాలకు లోబడి ఉంటే జాబితాలో లేకున్నా బోనస్ వస్తుంది అని స్పష్టం చేశారు.
అనంతరం ట్యాబ్ఎంట్రీలు ఎందుకు లేట్ చేస్తున్నారని సొసైటీల సభ్యులను ప్రశ్నించారు. ట్యాబ్ఎంట్రీ లేట్చేయడం వల్ల రైతులకు బ్యాంకుల్లో డబ్బులు ఆలస్యమవుతాయానీ తెలిపారు , వడ్లు కొనుగోలు ప్రక్రియ ముగియగానే వెంటవెంటనే లారీల్లో మిల్లులకు తరలించాలని, లేకుంటే సెంటర్ ఇన్చార్జిలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, మిల్లర్లు దిగుమతి చేసుకోనట్లయితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఏరోజుకారోజు టాబ్లో నమోదు చేసి రైతులకు సకాలంలో బిల్లులు అందేలా చూడాలన్నారు.
- Advertisement -