- Advertisement -
అధికారికంగా స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు
Official freedom fighter Vadde Obanna's birth anniversary celebrationsబేతంచెర్ల
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి వడ్డే ఓబన్న సర్వ సైన్యాధ్యక్షుడి గా ఉన్న సమయంలో ప్రజలకు శిస్తులు,వసూళ్ల విషయంలో బ్రిటీషర్లు ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో,వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి,బ్రిటీషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి అమరుడైన వడ్డే ఓబన్న సేవలను ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో వేడుకలను జరుపుకుంటామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా
మండల కేంద్రమైన బేతంచెర్ల పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఘనంగా ఈఓఆర్డి మల్లికార్జున,ఎస్సై రమేష్ బాబు, ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీపీ బుగ్గన నాగ భూషణం రెడ్డి మాట్లాడుతూ తెల్ల దొరల భరతం పట్టిన వీరుడు వడ్డే ఓబన్న అంటూ కొనియాడారు.ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వడ్డెర సంఘం సీనియర్ నాయకులు మక్కల సుబ్బరాయుడు,డేరంగుల సుబ్బరాయుడు లు మాట్లాడుతూ వడ్డే ఓబన్న జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని,నేడు ఆయన 218 వ జయంతి వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని,ఆయన స్పూర్తితో వడ్డెరుల చిరకాల కోరిక అయినా ఎస్టీ సాధనే ధ్యేయం గా ముందుకు వెళ్తామని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెచ్.కొటాల సర్పంచ్ వెంకటేశ్వర్లు,డి.మురళీకృష్ణ,బం డ రాముడు,లాలప్ప,నాగేష్,గురుమూర్ తి,పెద్దరాజు, ఆయా శాఖల అధికారులు,అధిక సంఖ్యలో వడ్డెర సంఘం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -




