Sunday, September 8, 2024

సజావుగా ఎన్నికల నిర్వహణకు నిబంధనల మేరకు అధికారులు పనిచేయాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా
రేపటి నుంచి మూడు రోజులపాటు ఎన్నికల వ్యవపరిశీలకుల పర్యటన
ఓటర్ గుర్తింపు కార్డుల ముద్రణ & పంపిణీ
త్వరితగతిన జరిగేలా చర్యలు
ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

భూపాలపల్లి, నవంబర్ 03: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికలు కమిషన్ నిబంధనలు అధికారులు తూచా తప్పకుండా పాటించాలని   జిల్లా  కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా  ఎన్నికల నిర్వహణ   పై  సంబంధిత  ఎన్నికల నోడల్ అధికారులతో రివ్యూ నిర్వహించారు.
జిల్లా  కలెక్టర్ & ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ  ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నిర్వహించాలని, ప్రస్తుత సమయంలో ఎవరికి సెలవులు మంజూరు చేయడం కుదరదని, ఎట్టి పరిస్థితులలో రిలాక్సేషన్ లభించిందని అన్నారు. 1950 కాల్ సెంటర్, సి – విజల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి అధికారులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు.
రేపటి నుంచి మూడు రోజులపాటు ఎన్నికల పరిశీలకులు కౌశిక్ రాయ్ భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తారని , ఎన్నికల పరిశీలకుల పర్యటన నేపథ్యంలో ఖర్చులు రిజిస్టర్లు, నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకుల పర్యటన జిల్లాలో 3 సార్లు ఉంటుందని, నవంబర్ 3 నుంచి నవంబర్ 5 వరకు మొదటిసారి, నవంబర్ 9 నుంచి నవంబర్ 30 మధ్యలో రెండోసారి, డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 5 మధ్యలో మూడోసారి ఎన్నికల పరిశీలకుల పర్యటన ఉంటుందని దానికి అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని నూతన ఓటర్లకు ఓటర్ గుర్తింపు కార్డును ముద్రింపజేసి వాటిని పంపిణీ చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసి పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో అందుబాటులో ఉన్న ఈవీఎం యoత్రాలు బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు వివరాలు తెలుసుకున్న కలెక్టర్ సెక్టార్ అధికారులకు నవంబర్ 20 నుంచి అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయాలని, ఈవీఎం య0త్రాల కమిషనింగ్ మరియు పోలింగ్ మెటీరియల్ లను సిద్దం చేసుకోవాలని, బ్యాటరీలు జాగ్రత్తగా నిలువ చేసి ఉంచాలని తేమ ప్రాంతంలో ఉంచకుండా చూడాలని అన్నారు.  రికార్డింగ్ అధికారులు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు శిక్షణకు హాజరుకాని సిబ్బంది వివరాలు అందించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రెవెన్యూ డివిజన్ అధికారి రమాదేవి , ఎన్నికల నోడల్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్