అధికారులు రైతాంగ శ్రేయస్సుకోసం పనిచేయాలి
– ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం,
తాడేపల్లిగూడెం మండలం పడాల మార్కెట్ యార్డ్ ను శుక్రవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులు రైతాంగ శ్రేయస్సు కోసం పనిచేయాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ చేస్తా అని ఏమైనా తేడాలు ఉంటే ఉపేక్షించేది లేదన్నారు.
అవినీతి పాల్పడితే ఊరుకోమని హెచ్చరించారు. రైతాంగానికి మేలైన సేవలు అందించేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మార్కెట్ యార్డ్ లో ఏడాదికి రెండు కోట్ల అనుసంధాన రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఐదేళ్లలోరూ. 10 కోట్లతో లింక్ రోడ్లు నిర్మిస్తామన్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడును మరిన్ని నిధులు కోర్తామన్నారు. ఆయన వెంట ఏఎంసీ గ్రేడ్-1 కార్యదర్శి ఎం ఎన్ వి ప్రభాకర్, ఉమ్మడి నాయకులు ఉన్నారు.
అధికారులు రైతాంగ శ్రేయస్సుకోసం పనిచేయాలి
- Advertisement -
- Advertisement -