పారిశుద్ధ్యం పై అధికారులు మొద్దు నిద్ర!
Officials sleep fast on sanitation!
హైడ్రా కోదాడకు వర్తింపజేసి ఆక్రమణకు గురైన చెరువులు కాపాడాలి.
బిజెపి నాయకురాలు సులోచన.
కోదాడ ,సెప్టెంబర్ 6(వాయిస్ టుడే ప్రతినిధి).
కోదాడ పట్టణంలో వరద బీభత్సానికి వార్డులలో పారిశుద్ధ్యం పేరుకుపోయి, ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిన, సంబంధిత అధికారులు నేటికీ ఎలాంటి చర్యలుచేపట్టకుండా మొద్దు నిద్రలో ఉన్నారని, బిజెపి సీనియర్ నాయకురాలు నూనె సులోచన ఆవేదన వ్యక్తం చేశారు. వార్డులలో వీధిలైట్లు లేక ,డ్రైనేజీ పూడిక తీయక ,ప్రజలు అల్లాడిపోతున్న అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆమె అన్నారు. పట్టణంలో అనేకచోట్ల రోడ్లు, డ్రైనేజీ శిథిలావస్థకు చేరుకున్నా ,ఎలాంటి మరమ్మతు పనులు చేపట్టకపోవడం విచారకరమని ఆమె అన్నారు. వార్డులలో పారిశుద్ధ్యం పేరుకుపోయిన నేటికీ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదని ,ఇప్పటికైనా సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టాలని, హైదరాబాదులో కొనసాగుతున్న హైడ్రా ను కోదాడకు కూడా వర్తింపజేసి , ఆక్రమణకు గురైన కోదాడ చెరువును కాపాడాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.


