ఓల్డ్ సిటీ ఎంఐఎం జాగీరు కాదు.. బండి సంజయ్

- Advertisement -

ఓల్డ్ సిటీ ఎంఐఎం జాగీరు కాదు.. బండి సంజయ్

Old City is not mim Jagir.. Bandi Sanjay

కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంఐఎం ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యత్వ నమోదుకు పిలుపునిచ్చిన అయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వంలో రైతులకు న్యాయం జరిగిందని, ఆదివాసీ మహిళ ముర్మును రాష్ట్రపతిని చేశామని అన్నారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని అన్నారు. ఓల్డ్ సిటీ ఎంఐఎం జాగీరు కాదని అన్నారు బండి సంజయ్. కస్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపునిస్తామని అన్నారు. అందరు బీజేపీ సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఎస్సీ, ఎస్టీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని, ప్రతి బూత్ తిరిగి నా విజయం కోసం కృషి చేసింది కార్యకర్తలే అని అన్నారు.రెట్టించిన ఉత్సాహంతో సభ్యత్వ నమోదు చేయించాలని పిలుపునిచ్చారు.ఈ దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.370 ఆర్టికల్ రద్దు చేసిన గొప్ప వ్యక్తి మోదీ అని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ప్రభుత్వం బీజేపీ అని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular