ఈ నెల 7 వ తేదీన టిడిపి అధినేత నారా చంద్రబాబు ఆచంట రాక
ఆచంట
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో చంద్రబాబు బహిరంగ సభలో ఈ నెల 7వ తేదీన పాల్గొనున్నారు.. ఇక్కడ నుండే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు .. దీంతో సభ స్థలి ఏర్పాట్లపై టిడిపి నాయకులు నిమగ్నం అయ్యారు.. ఆచంట కు టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మాజీ మంత్రి జవహర్, పీతల సుజాత చేరుకుని విస్తృత సమావేశం లో పాల్గొని కార్యచరణ రూపొందించారు..నాయకులుకు, కార్యకర్తలకు దిశ నిర్దేశం తెలియజేశారు.. కార్యక్రమంలో భాగంగా పితాని మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల శంఖారావం ఆచంట నుండే పూరించనున్నారు అని..కార్యకర్తల, అభిమానులతో లక్ష మంది తక్కువ కాకుండా బహిరంగా సభ నిర్వహిస్తాం అని నా భూతో..నా భవిష్యత్ ద్వారా సభ జరగబోతుంది అన్నారు..
సభ ద్వారా టిడిపి ,జనసేనల ఆలోచనలు.. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానం ఈ వేదిక ద్వారా బహిర్గతం చేస్తాం అని తెలిపారు.175 కి 175 సీట్లు వస్తాయి అన్న జగన్.. నేడు 80 మంది నెగ్గారు అని బహిర్గతం చేసిన జగన్ ని అభినందిస్తున్న అనిజనసేన ,టిడిపి కూటమి ఐక్యత పోరాటానికి జగన్ భయపడుతున్నాడు అన్నారు..
జగన్ ఎన్ని కుతంత్రాలు పన్నిన, సార , ఇసుక, మైనింగ్ డబ్బు ఖర్చుపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలన్నా..ప్రజలు ఈ ఎన్నికల్లో నీకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు.. నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పంచుకో అన్నారు.ఎన్నికలు అవినీతికి. నీతిమంతమైన రాజకీయానికి పోరాటమే తప్ప.. ధనికులకి పేదవాళ్ళకి కాదు అని హితువు పలికారు.175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పారిపోతున్నారు.. ఎవరొస్తే వారిని ఆకట్టుకో.. మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనిమాజీ మంత్రి పితాని మీడియా ద్వారా వెల్లడించారు
ఈ నెల 7 వ తేదీన టిడిపి అధినేత నారా చంద్రబాబు ఆచంట రాక
- Advertisement -
- Advertisement -


