సిద్ధిపేటలో మరోసారి హైటెన్షన్…రంగంలోకి మైనంపల్లి…!

- Advertisement -
 రంగంలోకి మైనంపల్లి…సిద్ధిపేటలో మరోసారి హైటెన్షన్…!!!

Once again high tension in Siddipet…Minampalli into the field…!

సిద్దిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ , బీజేపీ పోటాపోటీ సమావేశాలకు పిలుపునివ్వడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల పరిణామాల దృష్ట్యా ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్ధిపేటలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు నేతృత్వంలో సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఈమేరకు ఆయన 200కార్ల కాన్వాయ్ తో సిద్ధిపేటకు బయల్దేరారు. అదే సమయంలో రుణమాఫీపై కాంగ్రెస్ మోసం చేసిందంటూ నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గ్రామ స్థాయి నుంచి రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇటీవలే హరీష్ రావు క్యాంప్ ఆఫీసు దాడి ఘటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రుణమాఫీపై వార్ నడుస్తోన్న వేళ ఇరు పార్టీలు సిద్ధిపేటలో సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ ప్రధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. కాంగ్రెస్ టార్గెట్ గా హరీష్ తీవ్ర విమర్శలు చేస్తుండటంతో.. తాజా సమావేశంలో మైనంపల్లి హనుమంత రావు ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తి రేపుతోంది.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular