ప్రజా గాయకుడు గద్దర్, ప్రజా నాయకుడు గద్దర్, ప్రజా కళాకారుడు గద్దర్,
నింగి కెగిసినా ప్రజల మదిలో జీవించి ఉన్న నాయకుడు గద్దర్, అడుగు తీసి అడిగేస్తే ప్రభంజనం సృష్టించిన నాయకుడు గద్దర్, గద్దర్ ఒక ప్రభంజనం, గద్దర్ ఒక మేల్కొలుపు అని గద్దర్ ని స్మరిస్తూ గురువారం రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని టాగూర్ ఆడిటోరియంలో గద్దర్ పాటతో ఒకరోజు అనే కార్యక్రమం ప్రొఫెసర్ కాసిం అధ్యక్షతన ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో 30 మంది ప్రజా గాయకులు,కవులు కళాకారులు, వందల సంఖ్యలో విద్యార్థులు, పాల్గొన్నారు, కవులు కళాకారులు గద్దర్ ని స్మరిస్తూ ఏ మాట కైన , ఏ ముచ్చట అయినా అలవోకగా పాట రూపం తెచ్చే వారని, ఆయన మాటే ఒక పాటని, ఆయన జీవించి ఉన్నంతకాలం తన జీవితాన్ని పోరాటాలకు, ప్రజలకు అంకితం చేశారని.. ఆయన పోతూ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచారని స్మరించుకున్నారు. అన్యాయాలని పాటలు రూపంలో ఎత్తిచూపే వారిని, పాటల్లోనే జీవించేవారని ఆయన పాడితే పాటకి ప్రాణం వచ్చేదని, ఆయన మాట పాటలతో ప్రజలు ప్రభావితం అయ్యారని, తూటాలను సైతం ఎదురు నిలిచిన గుండె ధైర్యం తనదని…. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని స్మరిస్తూ…. ఆయన్నికొనియాడారు. ఈ సంస్మరణ సభలో కవి అందెశ్రీ, అల్లం నారాయణ విమలక్క మిట్టపల్లి సురేందర్ ఏపూరి సోమన్న మధుప్రియ మరియు కళాకారులు గాయకులు పాల్గొన్నారు.