- Advertisement -
వందేళ్ల ముందుచూపు… పుస్తకావిష్కరణ
One Hundred Years Ahead... Book Launch
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ దశాబ్ద కాలం పాటు కృషితో అందించిన ప్రగతి పాలనలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి బలమైన పునాదులు వేయగలిగారన్న ఆర్బీఐ నివేదిక గణాంకాలతో, జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘‘వందేళ్ల ముందుచూపు’’ పుస్తకాన్ని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు.
సోమవారం నాడు ఎర్రవల్లి నివాసంలో, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా, ఈ పుస్తకాన్ని గౌరీశంకర్ కేసీఆర్ కి అందజేశారు.
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ హోంమంత్రి మహ్మద్ అలీ, వి. ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -