- Advertisement -
ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానం చేయాలి
One Police One State should be done
పోలీసు భార్యల సచివాలయం ముట్టడి
హైదరాబాద్
ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసు కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడించారు. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి మా భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలి. అది అమలు అయ్యే వరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుండి 5 సం” లు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. రిక్రూట్మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారు. బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల మా కుటుంబాలకు దూరమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేసారు. కానిస్టేబుల్ వాళ్ళ భార్యలతో పాటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడి కి వచక్చారు.
- Advertisement -