కొనసాగుతున్న అంగన్వాడి దీక్షలు
– తాడేపల్లిగూడెం రైల్వే గూడ్స్ షెడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు
పెంటపాడు
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రిలే నిరాహార దీక్షలు బుధవారం కి 16వ రోజు కొనసాగాయి. అంగన్వాడీ సమస్యలు న్యాయ సమ్మతమైన సమస్యలు ఆ సమస్యలు పరిష్కారం
కోసం తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ ఈ సమ్మెకు సంపూర్ణమైన మద్దతు మరియు ఆర్థిక సహకారం అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమ్మె పరిష్కారం
చేయాలని చిన్నపిల్లలు గర్భిణులు బాలింతలు ఇబ్బంది పడకుండా సమ్మె పరిష్కరించి వాళ్లని విధులకు పంపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్
అధ్యక్షులు సత్తి కోదండరామిరెడ్డి కార్యదర్శి చెర్ల పుల్లారెడ్డి ఉపాధ్యక్షులు కరిసాయి రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని
అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని అడుగుతున్నారే తప్ప ఇవి అంగన్వాడీల యొక్క గొంతెమ్మ కోరికలు కాదని వారు తెలిపారు .పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు
పెరగాలని 62 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత వాళ్లను బయటకు నెట్టివేయడం సరికాదని వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని వారు కోరారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
సిరపూవరపూ రంగారావు ,కర్రి సుబ్బిరెడ్డి, ఆకుల నారాయణ, అడపా ఆంజనేయులు ,కృష్ణ ,అడ్డగర్ల కృష్ణ, గాది వెంకట్రావు, మద్దాల పుత్రయ్య ,బుద్దాల నాని ఇంకా తదితరులు పాల్గొన్నారు.



