- Advertisement -
కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే
Ongoing Comprehensive Family Survey
హైదరాబాద్, నవంబర్ 9, (వాయిస్ టుడే)
రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే కొనసాగతుంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తారు. ఇప్పటికే మూడు రోజుల పాటు స్టిక్కరింగ్ ప్రాసెస్ పూర్తి చేశారు. సర్వేకు సంబంధించిన వివరాను సైతం ప్రాణాళిక శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా కుల, సామాజిక, విద్య, ఉపాధి తదితర వివరాలను అడిగి నమోదు చేసుకుంటారు. నిజానికి నవంబర్ 6 నుండి సర్వే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మొదట స్టిక్కరింగ్ చేశారు.అధికారికంగా నేటి నుండే సర్వే ప్రారంభం కానుంది. సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండేవారంతా స్వగ్రామాలకు వెళ్లాలా వద్దా అనే దైలమాలో ఉన్నారు. దీంతో వారు ఉన్నచోటునే వివరాలను వెళ్లడించాలని ప్రణాళికశాఖ స్పష్టం చేసింది. ఆధార్ కార్డులో ఉన్న వివరాల ఆధారంగానే సర్వే జరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వస్తారని వారు అడిగిన వివరాలు చెబితే సరిపోతుందని చెప్పింది.అయితే కొన్ని ముఖ్యమైన పత్రాలు మాత్రం దగ్గర పెట్టుకోవాలని సర్వే ప్రణాళిక శాక ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్ బుక్, సెల్ ఫోన్ నంబర్ల లాంటివి అందుబాటులో ఉంచాలని సూచించింది. ఎన్యూమరేటర్లు వచ్చే సమయానికి ఇబ్బంది పడకుండా ముందుగానే కాగితాలను సిద్దం చేసుకుంటే వివరాలు కూడా సులభంగా చెప్పొచ్చని స్పష్టం చేసింది. సర్వే పూర్తి కాగానే కుటుంబ సభ్యులు అన్ని వివరాలు సరైనవే అని ఒక సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ సర్వే ఆధారంగా కులాల వారిగా రిజర్వేషన్ల మార్పు, ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకే అందజేత లాంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది.
- Advertisement -