9.4 C
New York
Saturday, April 13, 2024

కొనసాగుతున్న మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక

- Advertisement -

హబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు.

దీని కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎక్స్‌అఫీషియో సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఈ ఉపఎన్నికలో మన్నె జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌), నవీన్‌కుమార్‌రెడ్డి (భారాస), సుదర్శన్‌గౌడ్‌ (స్వతంత్ర అభ్యర్థి) బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికోసం కొడంగల్‌ ఎంపీడీవో కార్యాలయానికి ఆయన రానున్నారు. నాగర్‌ కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్‌రెడ్డి, ఫరూక్‌నగర్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ ఓటు వేశారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!