మండల వ్యాప్తంగా సీజనల్ హాస్టల్స్ ప్రారంభం
Opening of seasonal hostels across the mandal
సీజనల్ హాస్టల్స్ ప్రారంభించిన అధికారులు,ప్రజా ప్రతినిదులు.
తుగ్గలి
తుగ్గలి మండలం పరిధిలోని కోతికొండ గ్రామంలో మండల విద్యాధికారి రామ వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో సోమవారం రోజున సీజనల్ హాస్టల్స్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చలికాలంలో మండలంలోని అన్ని గ్రామాల్లో చదువుకుంటున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు వింటర్ సీజన్లో దూర ప్రాంతాలకు వలసలు వెళుతూ వారి పిల్ల లైన విద్యార్థులను కూడా వారితో పాటు వెంటతీసుకెళ్లి విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్ కు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్ మధ్యలోనే ఆగిపోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు మండలంలో విద్యార్థుల కోరకు సమగ్ర శిక్ష సహకారంతో సీజనల్ హాస్టల్స్ ప్రారంభించడం జరిగిందని,మండలంలో ఏడు సీజనల్ హాస్టల్స్ ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని,సీజనల్ హాస్టల్స్ పూర్తి భాధ్యత ఆయా గ్రామాల మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందని మండల విద్యాధికారి రామ వెంకటేశ్వర్లు తెలియజేశారు.అదే విధంగా మండలంలోని ముఖ్య గ్రామాలైన జొన్నగిరి గ్రామంలో గ్రామ ప్రజలు విద్యార్థుల సమక్షంలో గ్రామ సర్పంచ్ ఓబులేసు ప్రారంభించారు.అదే విధంగా జి.ఎర్రగుడి గ్రామంలో విద్యార్థుల సమక్షంలో గ్రామ మాజీ సర్పంచ్ వెంకట స్వామి సీజనల్ హాస్టల్ ప్రారంభించారు. చెన్నంపల్లి గ్రామంలో విద్యార్థుల సమక్షంలో గ్రామ టిడిపి సీనియర్ నాయకులు మా బాషా,టిడిపి యువ నాయకులు రాజేంద్ర గౌడ్,కోటేష్ గౌడ్ ల ఆద్వర్యంలో మండల టిడిపి కన్వీనర్ రాంపల్లి ఆర్.తిరుపాలు నాయుడు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జొన్నగిరి టిడిపి సీనియర్ నాయకులు బాలన్న,ఎద్దుల దొడ్డి టిడిపి సీనియర్ నాయకులు ఈ.శ్రీనివాస్ గౌడ్,జొన్నగిరి గ్రామ టిడిపి యువ నాయకులు మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్,విద్యా కమిటీ చైర్మన్ మిద్దె రవి కుమార్ యాదవ్, పగిడిరాయి మాజీ సర్పంచ్ గుండమయ్య,నాగార్జున,కోతి కొండ గ్రామ పెద్దయ్య,ఆర్ఎస్ పెండేకల్ టిడిపి నాయకులు షేక్ చాంద్ బాషా,మామిళ్ళ కుంట గ్రామ టిడిపి నాయకులు తిమ్మప్ప మరియు ఏడు గ్రామాల పాఠశాలలలోని ప్రధానోపాధ్యాయులు,
ఉపాద్యాయులు మరియు విద్యార్ధిని విద్యార్థులు,విద్యార్థుల తల్లిదండ్రులు ఏడు గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.