- Advertisement -
హైడ్రాపై మండిపడ్డ విపక్ష నేతలు
Opposition leaders angry at Hydra
కూకట్ పల్లి
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, మాధవరం కాంతారావు హైడ్రా కమిషనర్ రంగనాథ పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారతు. కూకట్ పల్లి యాదవ బస్తీలో నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతికి హైడ్రా నిరంకుశ పోకడలే కారణం మాధవరం కృష్ణారావు అన్నారు. హైడ్రా పై దమ్ముంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. శనివారం ఆదివారం వచ్చింది అంటే నగర ప్రజలు భయ భ్రాంతులకు గురయ్యే పరిస్థితిని తీసుకువచ్చారనీ అన్నారు. హైడ్రా ఎవరికీ చెప్పకుంగా డైరక్ట్ గా .ఈహెచ్ఎంసి, పోలీసులను తీసుకువచ్చి ఇళ్లను కూలుస్తూ ప్రజల ఉసురు తీసుకుంటున్నారనీ నేతలు తీవ్రంగా విమర్శించారు.
- Advertisement -