Thursday, April 17, 2025

ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్…

- Advertisement -

ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్…
విజయవాడ, ఏప్రిల్ 15
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్య‌క్ష‌త‌న అమరావతి సచివాలయంలో మూడు గంటల సేపు  మంత్రి వర్గ సమావేశం జరిగింది.  24 అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిపి నిర్ణయాలు తీసుకున్నారు. పలు కీలక అంశాలు, అభివృద్ది పనులపై నిర్ణయాలు తీసుకున్నారు.  మే రెండో తేదీన అమరావతికి మోదీ వస్తారని చంద్రబాబు మంత్రులకు తెలిపారు. సీఆర్డీఏ 46వ ఆధారిటీలో అమోదించిన అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  అమ‌రావ‌తి నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన నిధులు స‌మీక‌రించుకునేందుకు సీఆర్డీఏ క‌మిష‌న‌ర్‌కు కేబినెట్ అనుమ‌తి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే  నూత‌న అసెంబ్లీ, హైకోర్టు భ‌వ‌నాల టెండ‌ర్ల‌కు అంగీకారం తెలిపింది. టెండర్లలో ఎల్ 1గా నిలిచిన కంపెనీకి పనులు అప్పగించేందుకు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవన నిర్మాణానికి రూ. 617 కోట్లు, హైకోర్టు నిర్మాణానికి రూ.786 కోట్లు, ఎల్‌ 1 బిడ్డర్‌లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అందజేసేందుకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌కు అధికారాన్ని కట్టబెడుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. క్లైమేట్ గవర్నెన్స్ మెకానిజాన్ని అభివృద్ధి చేయడం క్లైమేట్ యాక్షన్ ప్లాన్, డేటా డ్రైవన్ ప్లానింగ్ కెపాసిటీ బిల్డింగ్ కోసం స్టేట్ క్లైమేట్ సెంటర్‌ను మూడు నగరాల్లో ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.  గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడిం పాలెంలో వంద బెడ్లతో ఈఎస్ఐ ఆస్పత్రికి స్టాఫ్ క్వార్టర్స్‌కు భూమి కేటాయింపులకు కేబినెట్‌లో  నిర్ణయం తీసుకున్నారు. . ద్వారకా తిరుమల మండలం రాఘవాపురంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 30 ఎకరాలు భూమిని ఉచితంగా కేటాయించారు.  ఐదో ఎస్ఐపీబీ సమావేశంలో  రూ.30,667 కోట్లు పెట్టుబడులు, 32,133 ఉద్యోగాలు వ‌చ్చే ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆమోదించారు. వాటికి  కూడా కేబినెట్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ ఏర్పాటుతో సహా పలు కంపెనీల పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆర్డినెన్స్‌పై మంత్రి మండలిలో చర్చించి ఆమోదం తెలిపింది.  జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో కీలక చర్చ జరుగుతోంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. జాతీయ ఎస్సీ కమిషన్ పరిశీలన తర్వాత తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది.    కుప్పం నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు,  నెల్లూరులో ఏపీఐఐసీకి, విజయనగరం జిల్లాలో గ్రే హౌండ్స్‌కు   భూములను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీ ముగిసిన తరవాత మంత్రులతో  చంద్రబాబు రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్‌సీపీ ఫేక్ న్యూస్ తో మత విద్వేషాలు పెంచాలనుకుంటోందని.. ఈ విషయంలో మంత్రులు చురుకుగా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని ఎన్ని  సార్లు చెప్పినా మంత్రుల్లో స్పందన ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
సమావేశాని వచ్చి వెళ్లిపోయిన పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు కానీ ఎక్కువ సేపు ఉండలేదు. ఆయన అనారగ్యంతో ఉండటంతో..కేబినెట్ భేటీకి హాజరై వెంటనే వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ ఇటీవల అరకు  పర్యటనలో ఉన్నప్పుడే సింగపూర్ తన కుమారుడికి అగ్నిప్రమాదం గురించి  తెలిసింది. మానసికంగా ఒత్తిడికి గురైన పవన్ కల్యాణ్.. కుమారుడ్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. కానీ ఆయన అలసటకు గురయ్యారు. ఈ కారణంగా ఆయన సతీమణి అన్నా లెజ్ నోవా ఒక్కరే తిరుపతికి వెళ్లి మొక్కులు సమర్పించుకున్నారు. కేబినెట్  భేటీ కోసం ఆయన అమరావతికి వచ్చినప్పటికీ.. ఆరోగ్యం సహకరించలేదు. కేబినెట్ సమావేశానికి హాజరై…కూర్చోలేని పరిస్థితి ఉండటంతో విషయం చెప్పి వెళ్లిపోయారు. కేబినెట్ సమావేశం గురించి ప్రభుత్వ సమాచార మంత్రిత్వ  ఫోటోలు రిలీజ్ చేసింది  ఈ ఫోటోల్లో పవన్ కల్యాణ్ కుర్చీ ఖాళీగా ఉంది. దీంతో అందరూ పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశానికి రాలేదా అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే అధికార వర్గాలు మాత్రం పవన్ కేబినెట్ సమావేశానికి వచ్చారని కానీ  అనారోగ్యం కారణంగా ఉండలేకపోవడంతో వెళ్లిపోయారని క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గతంలోనూ అనారోగ్యం కారణంతో ఒకటి, రెండు సార్లు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటూ ఉండిపోయారు.   కుమారుడి ప్రమాదం కారణంగా పవన్ కల్యాణ్  మానసికంగా అలసిపోయారని.. ఇప్పుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేంత పరిస్థితుల్లో లేరని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు, మూడు రోజుల విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ అధికారిక సమీక్షలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన తర్వాత ఆరు నెలల పాటు అవిశ్రాంతంగా పని చేశారు.  అయనకు ఉన్న కొన్ని ఆరోగ్య సమస్యలు, నడుం నొప్పి వంటి వాటికి చికిత్స నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పెరిగిపోయినట్లుగా తెలుస్తోందిప్రస్తుతం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ హైదరాబాద్ లో ఉన్నారు. సింగపూర్ లో  బ్రాంకోస్కోప్ చికిత్స చేయడంతో.. ఇక్కడ ఫాలో అప్ ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంది. ఉపిరి తిత్తుల్లోకి పోగ పోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వాటిని తగ్గించాలంటే.. ముందస్తుగా ఇప్పుడు చికిత్స కీలకం. పవన్ కల్యాణ్ మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్