వ్యవసాయాభివృద్ధి కోసమే సేంద్రియ ఎరువులు
Organic fertilizers are for agricultural developmentఅన్నదాతల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యం
వినూత్న ఆగ్రోటెక్ రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోండి
ఆళ్లగడ్డ
అన్నదాతలు నష్టపోకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే వినూత్న ఆగ్రోటెక్ ఎల్ఎల్ పి లక్ష్యమని మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ బిల్లా రాజేష్ యాదవ్, డిజిఎం రాజేష్ బాబు లు తెలిపారు. నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండల పరిధిలోని కలుగొట్ల గ్రామంలో వినూత్న ఆగ్రోటిక్ ఎల్.ఎల్.బి వారి ఆధ్వర్యంలో రైతు సోదరులకు సేంద్రియ ఎరువులు, సేంద్రియ వ్యవసాయంపైఅవగాహన సదస్సులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ అన్నదాతలు రేయి, పగలు శ్రమించి అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టి పంటల దిగుబడులు రావాలని కోరుకుంటారన్నారు. కానీ రసాయన ఎరువుల ద్వారా అనుకున్న స్థాయిలో అధిక దిగుబడులు సాధించడం కష్టమన్నారు. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూమిలో భూసారం పెరిగి పంటలు అధిగ దిగుబడులు వస్తాయన్నారు. తద్వారా రైతన్నలు ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉందన్నారు.”వినూత్న ఆగ్రో టెక్ ఎల్.ఎల్.పి” సంస్థ రైతులకు అందించే సేంద్రీయ జీవన ఎరువులైనా “యోధ సేంద్రియ ఎరువులు, యోధ సి ఎం ఎస్ జీవన్ గోల్డ్, రైతుమిత్ర, ప్రణయ్, గ్రో హై గ్రాన్యూల్స్, గ్రో హై లిక్విడ్, డెల్టా ప్రో, తులిప్, యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ , టర్బో కే జి ఎఫ్6, రోషిని, ఉజ్వల్ , త్రిసూల్, ధర్మవీర్ , రత్నా, పృధ్వీరాజ్, తిరంగా, నైట్స్, త్రిలోక్, ఇగ్నిస్ 5 అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (జెడ్33%+ఎస్15%), అవనీ న్యూట్రిసోల్ కే ఎం ఎస్-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్ (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్, లను పంటకు వాడి భూమిలోని మిత్ర పురుగులు అయినటువంటి సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావాలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు. “వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సం॥రాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తూన్నారు. పలు గ్రామాల్లో సేంద్రీయ జీవన ఎరువులపై “రైతు అవగాహన సదస్సు ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతు సోదరులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




