దసరా నవరాత్రి ఉత్సవాలకు నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే
గంగాధర ఎస్సై నరేందర్ రెడ్డి
చొప్పదండి
Organizers of Dussehra Navratri festivals have to follow the rules
దసరా నవరాత్రి ఉత్సవాలకు దుర్గాదేవి విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు గంగాధర పోలీస్ నిబంధనలను తప్పక పాటించాలని కరీంనగర్ జిల్లా గంగాధర మండల ఎస్సై జి . నరేందర్ రెడ్డి శనివారం సూచించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ గంగాధర మండలంలో దుర్గాదేవి విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు గంగాధర పోలీస్ స్టేషన్ లో అనుమతి తీసుకోవాలని తెలిపారు.ఈ నెల 29-09-2024 నుండి 02-10-2024 తేది వరకు గంగాధర పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ పత్రాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. పాటించాల్సిన నిబంధనలు ఈ విధంగా సూచించారు.
1.దుర్గాదేవి విగ్రహాలను నెలకొల్పే ప్రాంతాలు,ఏ రోజు నిమ్జనం చేస్తారు,బయలు దేరే రూట్ మ్యాప్ ను అందజేయాలి.
2.విగ్రహాన్ని నెలకొల్పే ప్రాంతంలో కాలనీ వాసులకి బస్తి వాసులకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.
3.దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు విద్యుత్ శాఖ కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాలి.
4.నవరాత్రి ఉత్సవాలకుఅతి బారి శబ్దాలు కలిగె స్పీకర్లను ఎట్టి పరిస్థితిలో ఉపయోగించరాదు.5.చిన్న శబ్దాలు కలిగె స్పీకర్లను మాత్రమే వాడాలి.
6.దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఒక్కరు వాలంటీర్లు ఎంపిక చెయ్యాలని పలు సూచనలను కరీంనగర్ కమీషనరేట్ ఆదేశాల మేరకు సూచించినట్లు తెలియజేశారు.