13.2 C
New York
Thursday, February 29, 2024

మా సేవలు..అభివృధ్ది మీ కంటి ముందే కన్పిస్తాంది

- Advertisement -

ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా బీఆర్‌ఎస్‌ పథకాలు
కార్నర్‌ మీటింగ్‌లో బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌

మంథని: మా సేవలు..అభివృధ్ది మీ కంటి ముందే కనిపిస్తున్నాయని మమ్మల్ని ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా శనివారం మంథని మున్సిపల్‌ పరిధిలోని బోయిన్‌పేట, గొల్లగూడెంలలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు. ఐదేండ్లు ఏ పని చేయకుండా ప్రజలు సమస్యలు చెప్పుకుంటే మా ప్రభుత్వం లేదని చెప్పారని, అలాంటి వాళ్లు ఎన్నికల వస్తున్నాయని కమ్యూటినీ హాల్‌లకు నిధులు వెచ్చించడం మభ్యపెట్టడం కాదా అని అన్నారు.  ప్రజలపై ప్రేమ ఉంటే ఏడాదికి కొన్ని నిదులు తీసుకువచ్చినా ఐదేండ్లలో ఎంతో అభివృధ్ది జరిగేది కాదా అని ఆయన అన్నారు. నోట్ల సంచులతో వచ్చి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను, ప్రజాప్రతినిదులను కొనుగోలు చేస్తున్నారని ఆయన వివరించారు. అనేక ఏండ్లు ఈ ప్రాంతంలో పరిపాలన చేసిన కాంగ్రెస్‌ పార్టీ పాలకులు ఏం చేశారని ప్రజలు ఆలోచన చేయాలని, ప్రజలు చైతన్యం చెందితేనే అభివృధ్దిని సాధించుకుంటామన్నారు. గతంలో బోయిన్‌పేట, గొల్లగూడెం ఎలాంటి స్థితిలో ఉండేదో ఈనాడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మార్పు జరిగిందని ఆలోచించాలన్నారు. పనిచేసే నాయకులు ఎవరో ఓట్ల కోసం వచ్చే నాయకులు ఎవరో గమనించాలన్నారు.  ఇన్నేండ్లలో మంథని నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డగా ఎదిగితే అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని, తనలాంటి వాళ్లను అడ్డు తప్పిస్తే ఇక తమకు ఎదురే ఉండదని బావించి కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ప్రజలను దూరం చేయాలని చూస్తున్నారని ఆయన వాపోయారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్‌గా తాను, సర్పంచ్‌గా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌గా తన బార్య ఎంతో అభివృధ్ది చేశామని, అనేక సేవలు చేశామని ఆయన గుర్తు చేశారు. మీరు ఇంటి నుంచి బయటకు వస్తే మా సేవలు, మేం చేసిన అభివృధ్ది కన్పిస్తుందన్నారు. కానీ కాంగ్రెస్సోళ్లు ఏం చేసిండ్లో ఏం చేస్తరో చెప్పే పరిస్థితిలో లేరన్నారు. మన గురించి మన ఆకలి కష్టాల గురించి పట్టించుకోనోళ్లు ఈనాడు మళ్లీ మనవద్దకు ఓట్ల కోసం వస్తున్నారని, అలాంటి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
గ్యారెంటీ వారంటీ లేని పథకాలు కాంగ్రెస్‌వని, ఈనాడు పథకాల పేర్లు చెప్తున్న కాంగ్రెస్‌ నాయకులు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించాలన్నారు. సీఎం కేసీఆర్‌ గొప్ప పథకాలు అమలు చేస్తుంటే వాటిని మేం కూడా అమలు చేస్తున్నామని చెబుతున్నారని, పదేండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా రూ.200ల ఫించన్‌ను రూ.201 పెంచలేని చరిత్ర కాంగ్రెస్‌దని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే పథకాలను అమలు చేస్తున్నారని, ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను అమలు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రభుత్వ పథకాలతో పాటు తన సొంతంగా అనేక బృహత్తర సేవలు అందిస్తామని, మీ బిడ్డల భవిష్యత్‌బాధ్యత తానే తీసుకుంటానని హమీ ఇచ్చారు. ఈ నెల 7న మంథనిలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు ప్రతి ఒక్కరు తరలిరావచ్చి విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!