ఇతర భాషల్లో మన శంకర వర ప్రసాద్ గారు
Our Shankara Vara Prasad in other languages
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా… బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. వసూళ్ల పరంగా ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడీ సినిమా డిజిటల్ వేదికలో సందడి చేయడానికి సిద్ధమైంది.ఈ మెగా విక్టరీ మూవీ ఓటీటీ 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులో మాత్రమే రిలీజైన ఈ చిత్రాన్ని, ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి ప్రసారం చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లో డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకూ రూ.375 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగులో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. వింటేజ్ చిరంజీవి గ్రేస్, నయనతార పర్ఫార్మెన్స్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, వెంకటేష్ స్పెషల్ రోల్, సంగీతం.. అన్నీ కలిపి ఈ సినిమాని విజయ తీరాలకు చేర్చాయి.



