భారీగా పెరిగిన చికెన్
హైదరాబాద్, ఏప్రిల్ 10
రంజాన్ పండుగ ముంగిట చికెన్ ధరలు భారీగా పెరగడంతో నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలినట్టయింది. గతవారం రోజులుగా చికెన్ ధరలు పెరగడంతో రంజాన్ పండుగ జరుపుకునే మైనార్టీ సోదరులకు బడ్జెట్ పెరగనుంది. అయితే రెండరోజులుగా చికెన్ కిలో రూ.105 నుంచి రూ.115 వరకు, స్కిన్ లెస్ కిలో రూ.290, బోన్ లెస్ రూ.400 వరకు రిటైల్ మార్కెట్లో విక్రయించారు. అయితే ఎండాకాలంలో కోళ్ల మరణాల రేటు ఎక్కువగా ఉండటం ధరలు పెరగడానికి అసలు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.వేడిని తట్టుకోలేక కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఇక వారం క్రితం కిలో కోడి మాంసం ధర రూ.180 నుంచి రూ.220 వరకు ఉండేది. వేసవిలో కోళ్ల సరఫరా తక్కువగా ఉండటం కూడా ధరల పెరుగుదల కారణమవుతోంది. పౌల్ట్రీ రైతులు ఎయిర్ కూలర్ల ఏర్పాటు, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ కోళ్లను పెంచుతున్నారు. అధిక డిమాండ్, తక్కువ సరఫరా కారణంగా ఈ నెలలో ధరలు విపరీతంగా పెరిగాయి. ఆదివారం చికెన్ కిలో రూ.115 నుంచి రూ.125 వరకు ఉండగా, నెల క్రితం రూ.70 నుంచి రూ.80 మధ్య ఉంది.ఈ నెలలో ఈద్ ఉల్ ఫితర్ తర్వాత భారీగా పెళ్లిళ్లు జరుగుతుండటంతో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మెనూను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు చాలామంది. చికెన్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని ఫుడ్ కేటరర్లు కూడా చెబుతున్నారు. ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే మున్ముందు భారీగా ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులు ఎక్కువగా నాన్ వెజ్ తింటారు. అయితే పండుగ సందర్భంగా ధరలు పెరగడం షాక్ లాంటిదే.
భారీగా పెరిగిన చికెన్
- Advertisement -
- Advertisement -


