- Advertisement -
తెలంగాణ అసెంబ్లీలో ఓవర్సీస్ స్కాలర్ షిప్ల రగడ
Overseas scholarship campaign fight in Telangana assembly
హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఓవర్సీస్ స్కాలర్ షిప్లపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. విద్యార్థులకు స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టారని, లంచం లేకుండా బిల్లులు క్లియర్ చేయడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వ్యాఖ్యలు చేశారు. అయితే వివేకా వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ సభ్యుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. వివేకానందకు అసెంబ్లీ రూల్స్ పై అవగాహన ఉందన్నారు. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇక్కడ కూర్చుప్పుడు ఒక వేషం.. అక్కడ కూర్చున్నప్పుడు మరొక వేషం వేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
- Advertisement -