ఒవైసీ ప్రమాణదూమారం

- Advertisement -

ఒవైసీ ప్రమాణదూమారం
హైదరాబాద్, జూన్ 25,
పార్లమెంట్ లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జూన్ 24న సోమవారం నాడు కొందరు ఎంపీలు లోక్‌సభలో ప్రమాణం చేశారు. నేడు సైతం ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. ఈ క్రమంలో ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం దుమారం రేపింది. అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద పదాలు వాడారు. ప్రమాణం పూర్తి చేస్తూ చివర్లో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినాదాలు చేశారు. అసదుద్దీన్ జై పాలస్తీనా అనడంపై అధికార పక్ష నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా వివాదాస్పద నినాదాలు చేస్తే వాటిని రికార్డ్స్ నుంచి తొలగిస్తారు. అసదుద్దీన్ వాడిన వివాదాస్పద పదాల్ని లోక్ సభ రికార్డ్స్ లో నుంచి తొలగించే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular