ఎల్బీనగర్, వాయిస్ టుడే: ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని కోరుతూ ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్బీనగర్ నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నందికంటి చంద్రశేఖర్, మేడారం బాలకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, నరేష్, వెంకటేశ్వర్ తదితరులు ఎల్బీనగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి పాదయాత్రగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన ఘనత దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను కోరారు.



