సికింద్రాబాద్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
సికింద్రాబాద్ లో బిజెపి జెండా ఎగురవేయడం ఖాయం: సారంగ పాణి
సికింద్రాబాద్ నవంబర్ 24: తార్నాక డివిజన్ లాలపేట్, వినోబానగర్, శ్రీ పురి కాలనీ,చంద్రబాబు నాయుడు నగర్ ప్రాంతాల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగా పాణి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. సికింద్రాబాద్ లో ఈసారి బిజెపి అభ్యర్థి మేకల సారంగా పాణి నీ గెలిపించుకుని తీరుతామని ప్రజలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మేల్యే అభ్యర్థి మేకల సారంగా పాణి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని,ఈసారి సికింద్రాబాద్ లో బిజెపి జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు.సికింద్రాబాద్ లో సమస్యలు పేరుకుపోయాయని,సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పరిష్కరించడం లో విఫలం అయ్యాడని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో బీజేపి నాయకులు రామ్ వర్మ, సుక్క గణేష్, తదితరులు పాల్గొన్నారు.



