సికింద్రాబాద్, అక్టోబర్ 30 (వాయిస్ టుడే ప్రతినిధి): సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్ మనికేశ్వర్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వరికుప్పల భూపాల్ తన సొంత ఇంటిని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం గా ఏర్పాటు చేశాడు ఈ కార్యాలయాన్ని డెప్యూటీ స్పీకర్, బీఅర్ఎస్ నాయకులు పద్మారావు గౌడ చేతుల మీదగా ప్రారంభించారు. ఎన్నికల వేళలో డివిజన్లోని నాయకులు ప్రజలు ఈ కార్యాలయంను ఉపయోగించు కోవచ్చని బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వరికుప్పల భూపాల్ (ఆర్కే భూపాల్) తెలిపారు. ఈ కార్యాలయాన్ని ఎన్నికలవేళ ప్రారంభించిన పద్మారావు గౌడ్ వరికుప్పల భూపాల్ ను పద్మారావు అభినందించారు. కష్టపడి పని చేసే వారికి పార్టీలో – స్థానం ఉంటుందని ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు పద్మారావు గౌడ తెలిపారు. మణిక్వేశ్వర్ నగర్ లో ప్రజా సమస్యలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో యువనాయకులు రామేశ్వర్ గౌడ్, కిషోర్ గౌడ్, కిరణ్ గౌడ్,కళ్యాణ్ గౌడ్, త్రినేత్ర గౌడ్, డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి, సామల హేమ, రాసూరి సునీత, కంది శైలజ, లింగాన్ని ప్రసన్న లక్ష్మి, ఆలకుంట హరి,జింకల మల్లేష్, వరికుప్పల శ్యామ్, వరికుప్పల కృష్ణ, ఆలకుంట రవి మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




