నియంత్రణ రేఖ వద్ద పాక్ ఉగ్రవాది హతం

- Advertisement -

పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం ఉగ్రవాది హతం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ దేశానికి చెందిన ఉగ్రవాదులు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఉగ్ర దాడులు చేసేందుకు చేసిన యత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు..

Pakistani terrorist killed at Line of Control
Pakistani terrorist killed at Line of Control

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. (Army foils infiltration bid in Poonch) సోమవారం సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఓ పాక్ ఉగ్రవాది హతం అయ్యాడు..

పూంచ్ జిల్లాలోని దేగ్వార్ సెక్టార్‌లో అప్రమత్తమైన భద్రతా బలగాలు సోమవారం తెల్లవారుజామున చీకటి ముసుగులో ఇటువైపుకి చొరబడేందుకు ప్రయత్నించిన కొందరు ఉగ్రవాదుల కదలికలను గమనించి ఎదురుకాల్పులు జరిపారు. పాకిస్థాన్ వైపు నుంచి నియంత్రణ రేఖలోకి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత సైనికులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఎదురుకాల్పులు జరిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular