ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం
Palabhishekam for portraits of Chief Minister and Deputy Chief Minister
రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ అంశాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రేపు మొదటిసారి లక్ష రూపాయలు వరకు రుణం తీసుకున్న రైతులందరికీ రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వపరంగా ఆయా రైతు రుణ ఖాతాలలో నిధులు రేపు జమ చేయనుంది నెలాఖరు లోపల లక్షన్నర రూపాయలు రుణం తీసుకున్న రైతులందరినీ రుణ విముక్తుల్ని చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా ఆగస్టు 15వ తేదీ లోపల రెండు లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులందరికీ ఏకకాలంలో ఆయా రైతు రుణ ఖాతాలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రజాభవన్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసిసి అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్, గౌరీ సతీష్ తదితరులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు